

Shyam singharoy | నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో నాని రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో శ్యామ్ సింగరాయ్ పాత్రకు హీరోయిన్‌గా సాయి పల్లవి, వాసు పాత్రకి కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే సినిమా తారాగణంలో మాత్రం మడోన్న సెబాస్టియన్ మూడో హీరోయిన్‌గా చేస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.
ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుండగా ట్రైలర్ లాంచ్ ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను అలరించాయి. కానీ వీటిలో ఎక్కడా కూడా మడోన్న సెబాస్టియన్ కనిపించలేదు. అంతేందుకు ట్రైలర్ లాంచ్‌లో కూడా అమ్మడు కనిపించలేదు. దీంతో అభిమానుల్లో అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి.
ఈ సినిమాలో అమ్మడి పాత్రను మేకర్స్ ఎందుకు అంత గోప్యంగా ఉంచుతున్నారు? సెబాస్టియన్ పాత్ర అంత కీలకమా? లేకుంటే అంత ప్రాముఖ్యత లేని పాత్రనా? సెబాస్టియన్ మూడో హీరోయిన్ అంటే నాని మరో స్టైల్‌లో కూడా కనిపించనున్నాడా? ఇలా అనేక సందేహాలు అభిమానుల మదుల్లో మెదులుతున్నాయి. వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే డిసెంబర్ 24 వరకు వేచి చూడాల్సిందే.
#Nani# Shyam singha roy# sai pallavi# krithi shetty# madonna sebastian