

Liger | గోవా పర్యాటకుల్లో చాలా మందికి ఇది ఫేవరెట్ ప్లేస్ అనడం అతిశయోక్తేమీ కాదు. సెలబ్రిటీలు సైతం ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
ఈ స్పెషల్ స్టాట్‌లో ‘లైగర్’ హల్‌చల్ చేసేందుకు సిద్దమవుతోందట. అంతేకాకుండా తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయిందట. ప్రస్తుతం నెట్టింట ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ జనవరి 1ని తన గర్ల్ ఫ్రెండ్‌తో గోవా బీచ్‌లో గడపాలని ప్లాన్ చేస్తున్నాడట. ఆ అమ్మడు ఎవరో కాదు. కన్నడ బ్యూటీ రష్మిక మందాన.
వీరిద్దరు ఇప్పటికే పలు సినిమాల్లో కలిసి నటించారు. ఈ సినిమాల కారణంగా వీరిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కూడా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ స్నేహంతోనే వీరిద్దరు తమ న్యూ ఇయర్‌ను స్పెషల్‌గా గడపాలని నిర్ణయించుకున్నరట. అందుకే వీరిద్దరు గోవాను సెలెక్ట్ చేసుకున్నారట. మరి వీరిద్దరూ గోవా బీజ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారేమో చూడాలి.
#VijayDevarakonda #Rashmika #Goa #Liger #NewYear