

Liger | రౌడీ హీరో విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో దూసుకెళ్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ పూరీ డైరెక్షన్‌లో పాన్ ఇండియా రేంజ్ సినిమా చేస్తున్నాడు.
‘లైగర్’ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో లెజెండ్రీ బాక్సర్ మైక్‌టైసన్‌తో ఫైట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా కోసం విజయ్ తీసుకున్న పారితోషికం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా ఉంది. లైగర్ సినిమా కోసం విజయ్ దాదాపు రూ.35 కోట్లు తీసుకున్నాడట. మరి దీనిపై విజయ్ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
Vijay devarakonda, Liger, remuneration, puri jagannath