

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమాల్లో భీమ్లా నాయక్ ఒకటి. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా కలిసి నటిస్తుండగా.. ఈ సినిమా మళయాలం సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.
కానీ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేసింది మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్చేందుకు త్రివిక్రమ్ ఎంతో కష్టపడ్డాడట. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్‌లో అంతగా ఎమోషన్ నిపించదట, దాంతో పాటుగా రొమాంటిక్ సీన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయట.
అయితే త్రివిక్రమ్ ఈ సినిమా కథలో వాటిని పూర్తిగా మర్చేశాడట. ఎమోషనల్ సన్నివేశాలు గుప్పించడంతో పాటు పవన్, నిత్య మీనన్ మధ్య రొమాన్స్‌ను కూడా జోడించి తెలుగు తమ్ముళ్లకు మంచి ఫీస్ట్ రెడీ చేశాడట.
ఈ మేరకు సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి లేని వాటిని కూడా పెట్టి త్రివిక్రమ్ సినిమాను ఏ రేంజ్‌లో ప్రెజెంట్ చేస్తాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి బరిలో దిగనుంది.