Tapsee | షారుఖ్‌తో మూవీపై తాప్సీ క్లారిటీ.. మళ్లీ డైలమాలో పడ్డ ఫ్యాన్స్


Tapsee | బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను రిపోర్టర్లకు అదిరిపోయే సమాధానం ఇచ్చింది. తన తర్వాతి సినిమాపై వస్తున్న రూమర్లకు తాప్సి చెక్ చెప్పింది. ఫిక్స్ అయితే ఇంటి టెర్రస్ నుంచే అందరికీ చెప్తానంటూ సమాధానం ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. తాజాగా తాప్సి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందని, షారుఖ్, రాజ్‌కుమార్ హిరానీ కాంబో మూవీలో తాప్సీనే హీరోయిన్ అంటూ అనేక వార్తలు వాచ్చాయి.
వీటిపై స్పందించిన తాప్సీ ‘అదే నిజం అయితే అందరికన్నా ముందు నా నుంచే మీకు సమాచారం వస్తుందని, ముందు ఖరారు కానివ్వండని తెలిపింది. లేకుంటే అవన్నీ కేవలం రూమర్లుగానే ఉంటాయ’ని తాప్సీ చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Dhanush | ‘సార్’ మొదలయ్యారు.. ఇక రచ్చరచ్చే
‘మీరు చెప్పినట్లే ఖరారైతే నా ఇంటి రూఫ్ టాప్స్‌పై నుంచే అప్‌డేట్ ఇస్తా’ అని తాప్సీ చెప్పింది. దీంతో ఈ సినిమాపై మళ్లీ సందిగ్ధత ఏర్పడింది. షారుఖ్ సినిమా కోసం తాప్సీ పేరు రేస్‌లో ఉందని, అందుకనే ఫైనల్ అయ్యేవరకు ఆగాలని అమ్మడు చెప్పిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
#Tapsee #ShahrukhKhan #RajkumarHirani #Bollywood