

Tamanna | టాలీవుడ్ టాప్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా తన పెళ్లిపై స్పందించింది. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న తమన్నాపై తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
మిల్కీ బ్యూటీ పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతోందని, పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయిందంటూ వార్తలు తెగ వినిపించాయి. అయితే సినిమాలు, స్పెషల్ సాంగ్‌లతో బిజీ అయిన తమన్నా సోషల్ మీడియాకు దూరమైంది.
దాంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న తమన్నా తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన కెరీర్ ఇబ్బందులు లేకుండా మంచి ఆఫర్లతో సాగుతోందని, ఇప్పుడు పెళ్లి పేరుతో కెరీర్‌కు బ్రేకులు వేయలేనని అమ్మడు చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం మరో రెండేళ్ల వరకు పెళ్లి ధ్యాస లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఒకవేళ తన పెళ్లి ఫిక్స్ అయితే తానే స్వయంగా ప్రకటిస్తానని కూడా స్పష్టం చేసింది. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళాశంకర్’, ఎఫ్3, దటీజ్ మహాలక్ష్మీ, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటుగా రెండు కన్నడ సినిమాల్లోనూ అమ్మడు నటిస్తోంది.
#tamanna #marriage #movies #milky beauty