

Surya | తమిళ స్టార్ హీరో సూర్య తెలుగులోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇటీవల సూర్య సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఓటీటీలోనూ ఔరా అనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే సూర్యా తాజాగా చేస్తున్న సినిమా మాత్ర థియేటర్లలోనే విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. సూర్య ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘ఈటీ’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కూడా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే తెలుగు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ కూడా అదే రోజు విడుదల కానుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఎవరికి పెద్ద పీట వేస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆచార్య VS ఈటీ జోరుగా సాగుతోంది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఆచార్య ఉండగా సూర్యకు ఎక్కువ థియేటర్లు దొరకడమే కష్టమని, ఇక హిట్ మాట పక్కన పెట్టాలని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే ‘ఈటీ’ సినిమాలో సూర్యకు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా పాండిరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య, పాండిరాజ్ దర్శకత్వంతో ఇదివరకు వచ్చిన సినిమాలు బాగా అలరించడంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని మూవీ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సూర్య అనుకున్నట్లు సినిమా హిట్ అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే ఫిబ్రవరి 4 వరకు వేచి చూడాల్సిందే.
#Surya #ET #Acharya #Chiranjeevi #KoratalaSiva