Pushpa | బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుష్ప-2 అప్‌డేట్..?

Pushpa | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ రికార్డులు సృష్టిస్తోంది. ప్రారంభం నెమ్మదిగా జరిగినా జోరులో మాత్రం ఏమాత్రం

Spread the love
Pushpa
Pushpa

Pushpa | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ రికార్డులు సృష్టిస్తోంది. ప్రారంభం నెమ్మదిగా జరిగినా జోరులో మాత్రం ఏమాత్రం ‘తగ్గేదే లే’ అంటోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారిస్తోంది. పుష్ప-1 నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది.

అయితే ఇప్పటి నుంచే సుకుమార్ ఈ సినిమా రెండో భాగంపై కూడా దృష్టి పెట్టాడు. సెకండ్ పార్ట్‌లో పాత్రల నిడివిని సైతం సరిగ్గా సెట్ చేసుకుంటున్నాడు. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘పుష్ప-2’ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమా అప్‌డేట్ వచ్చింది. అది కూడా పుష్ప-2 రిలీజ్‌కు సంబంధించి వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

‘పుష్ప-2’ రిలీజ్ విషయంలో సుకుమార్ సరికొత్త ప్లాన్ చేశాడట. ఈ సినిమాను వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో కొన్ని సీన్న్ హాలీవుడ్ తలతన్నేలా ఉండనున్నాయని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిలో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
#Pushpa-2 #AlluArjun #Sukumar #Pushpa

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *