Sukumar | సుకుమార్ భారీ ప్లాన్.. పాన్ ఇండియా స్టార్స్‌తో మల్టీస్టారర్..??

Sukumar | సుకుమార్ ప్రస్తుతం పుష్ప సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఎంజాయ్‌మెంట్‌లో భాగంగా సుక్కు తన నెక్స్ట్ సినిమాపై

Spread the love
Sukumar

Sukumar | సుకుమార్ ప్రస్తుతం పుష్ప సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఎంజాయ్‌మెంట్‌లో భాగంగా సుక్కు తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీకి ఇచ్చేశాడు. పుష్పతో వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సుక్కు నెక్స్ట్ మూవీతో దాన్ని బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

అందుకోసం ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకుమార్ పుష్ప తరువాత తన ప్లాన్‌ను చెప్పేశాడు. ‘పుష్ప: ది రూల్’ పూర్తయిన తర్వాత సుక్కు ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు.

అది కూడా పాన్ ఇండియా స్టార్స్‌ విజయ్ దేవరకొండ, చెర్రీతో మాట్లాడానని, వాళ్లు కూడా పచ్చ జెండా ఊపారని సుకుమార్ చెప్పాడు. దీంతో ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఊహకు కూడా రావట్లేదంటూ అభిమానులు అంటున్నారు.

అయితే చెర్రీ తన తాజా సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్‌ సినిమాను ప్రారంభించనున్నాడట. శంకర్ డైరెక్టోరియల్ ఆర్‌సీ 15 తరువాత మరో ఐ-స్టన్నింగ్ ప్రాజెక్ట్ చేయనున్నాడని మెగా అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమాతో పాటుగా సుక్కు, చరణ్‌ కాంబోలో కూడా ఓ సినిమా రానుంది. ఈ సినిమా ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేదు. దీనిపై కూడా త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
#sukumar# Charan# Vijay devarakonda# Pushpa

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *