

Delhi | దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. మూడేళ్ల పసికందు అతి కిరాతకంగా హత్య చేయబడింది. చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పాప పార్కులో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఆ పాప తండ్రి అక్కడే తోటమాలిగా పనిచేస్తుంటాడని స్థానికులు తెలిపారు. మూడేళ్ల పాప పార్క్‌లో ఆడుకుంటున్న సమయంలో దాదాపు 5-6 కుక్కలు పాపపై దాడి చేశాయని వెల్లడించారు.
ఈ దాడిలో పాపా తీవ్రంగా గాయయపడిందని, ఆ గాయాల కారణంగానే మరణించిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సమయంలో పాప తండ్రి అదే పార్కులో పని చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
మున్సిపాలిటీ వారికి ఫిర్యాదు అందించామని, వారు త్వరలోనే చర్యలు చేపడతామని తెలిపారని పోలీసులు పేర్కొన్నారు.
#StreetDogs #Police #Delhi