

తనవైన మధుర గీతాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో గూడు కట్టుకున్న గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. అయితే సీతారామశాస్త్రి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో ఆయనను కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా కిమ్స్ వైద్యులు సీతారామ శాస్త్రి ఆరోగ్యంపై ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. రేపు ఉదయానికి ఏ విషయం చెప్పే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉంటే 1986లో సీతారామ శాస్త్రిగా చిత్రసీమలో అడుగు పెట్టారు. ఆయన సిరివెన్నెల సినిమాతో తన ప్రతిభను చాటారు. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆ తర్వాత తెలుగు చిత్ర సీమలో ఎన్నో అద్భుత గీతాలను రచించారు. ఆయన రచించే ప్రతి పాట కూడా ఆయన కలం నుంచి జాలువారిన ముత్యాల్లా ఉంటాయి. ప్రేమ పాటల నుంచి భావేద్వేగ పాటల వరకు ప్రతి పాటను ప్రేక్షకుడు మెచ్చేలా, ప్రేక్షకులను నచ్చేలా రాయడమే ఆయన ప్రత్యేకత. ఆ పాటలు వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా వాటిని ప్రతి తెలుగు వారికి గుర్తుండి పోయాయి.
1 thought on “Sirivennela | కిమ్స్ ఆసుపత్రిలో సీతారామ శాస్త్రి.. తీవ్ర అస్వస్థతే కారణం..”