

Fans | ఈ మధ్య సెలబ్రిటీలు తమ ఫ్యాన్స్‌ను చూస్తే భయపడాల్సి వస్తుంది. వారి నుంచి తప్పించుకు తిరగాల్సి వస్తుంది. అందుకు కరోనా కారణం కాదు. అభిమానులకు పెరిగిపోయిన సెల్ఫీ పిచ్చి. అవును.. అభిమానులు ఆటోగ్రాఫ్‌లను మరిచిపోయారు. ఎవరు కనిపించినా సెల్ఫీ కోసం ఎగబడుతున్నారు.
ఈ క్రమంలో సెలబ్రిటీలు ఎంత ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో సెలబ్రిటీలు జనస్రవంతిలోకి రావాలంటేనే తీవ్రంగా ఆలోచించుకోవాల్సి వస్తుంది. తాజాగా సింగర్ మంగ్లీ కూడా అభిమానుల నుంచి ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. వారి దెబ్బకు మంగ్లీ అటు ఇటు పరుగులు తీసింది.
ఈ తతంగం అంతా ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. మంత్రి కుమార్తె రిసెప్షన్ వేడుకకు వెళ్లిన మంగ్లీ అక్కడ అభిమానులు సెల్ఫీ అంటూ ఎగబడటంతో తీవ్ర అసహనానికి గురైంది. అభిమానుల తీరుకు మంగ్లీకి చిర్రెత్తుకొచ్చింది. దాంతో వారిపై మండిపడింది. ముఖం పగలగొడతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అయితే ఇదే ఇబ్బంది పడిన తారలు తమను ఫొటోల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని, తమ పరిస్థితి కాస్త తెలుసుకొని నడుచుకోవాలని ఫ్యాన్స్‌ను కోరారు.
#Mangli #Fans #Singer