

Akhanda | గతేడాది సంచలనాలు సృష్టించి యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న సినిమా ‘అఖండ’. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ‘అఖండ’ ప్రకంపనలు అమెరికా బాక్సాఫీస్‌నే బద్దలు కొట్టాయి.
ఆ తరువాత ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాతో నాని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమాల మధ్య పోరు మొదలైంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధం కావడమే ఇందుకు కారణం. ఈ ఏడాది జనవరి 21న వీకెండ్ సందర్భంగా ‘అఖండ’ సినిమాను డీస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.
అదే రోజున నెట్‌ఫ్లిక్స్‌లో ‘శ్యామ్ సింగరాయ్’ని విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో ఈ రెండు సినిమాల హద్య ఓటీటీ పోరు మొదలైంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమావైపు అభిమానులు మొగ్గు చూపుతారో చూడాలి.
#Akhanda #ShyamSinghaRoy #Balayya #Nani #Netflix #Disney+Hotstar #OTTRelease