Shiva Shankar Master | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. శివ శంకర్ మాస్టర్ ఇకలేరు..

Shiva Shankar Master | టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఇకలేరు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం..

Spread the love
Shiva Shankar Master
Shiva Shankar Master

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఇక లేరు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం 8 గంటలకు తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే కొన్ని రోజుల క్రితం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స ప్రారంభించిన వైద్యులు  ఆయనకు కరోనా కారణంగా 75 శాతం ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అయ్యాయని తెలిపారు. అయినప్పటికీ ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో ఆదివారం కన్నుమూశారు. ఆయన వైద్యం కోసం ఇప్పటికే పలువురు ప్రముఖ నటులు ఆర్థిక సహాయం అందించారు. కానీ ఆయన ప్రాణాలు నిలువలేదు.

ఇది కూడా చదవండి: Salman Khan | ‘అలా వేస్ట్ చేయకండి’.. ఫ్యాన్స్‌కు సల్మాన్ రిక్వెస్ట్ 

అయితే 1948 డిసెంబర్ 7న జన్మించారు. ఈయన చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి ఓ వ్యాపారి. ఆ తరువాత డాన్స్‌పై ఉన్న మక్కువతో సాంప్రదాయ నృత్యం నేర్చుకున్నారు. ఆ తర్వాత 1975లో వచ్చిన ‘పొట్టు భరతమమ్’ అనే తమిళ సినిమా శివ శంకర్ మాస్టర్ తన కెరీర్ ప్రారంభించారు. ఆ సినిమాలో ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వచ్చిన ‘కురువికూడు’ చిత్రంతో కొరిగ్రాఫర్‌గా పరిచయమయ్యారు. తన ప్రతిభతో చిత్ర సీమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన తమిళం సహా 10 ఇతర భాషల సినిమాలకు కొరియోగ్రాఫి చేశారు.

ఇది కూడా చదవండి: Salman Khan | ‘అలా వేస్ట్ చేయకండి’.. ఫ్యాన్స్‌కు సల్మాన్ రిక్వెస్ట్

ఆయన తన కొరియోగ్రఫీ కెరీర్‌లో 800కు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. కేవలం డాన్స్ మాస్టర్‌గానే కాకుండా కొన్ని సినిమాల్లో తన నటనతోనూ ప్రేక్షకులను మెప్పించారు. 2003లో వచ్చిన ‘ఆలయ్’ ఆయనను వెండితెరకు పరిచయం చేసింది. అప్పటి నుంచి అడపాతడపా చిత్రాల్లో చేశారు. ఆయన కెరీర్‌లో 30 చిత్రాల్లో ఆయన తన నటనను కనబరిచారు. వాటితో పాటుగా బుల్లితెరపై వచ్చే అనేక డాన్స్ షోలలో జడ్జిగా కూడా ఆయన వ్యవహరించారు. ఇలా ఆయన చేసిన ప్రతి రంగంలోనూ రాణించారు.

Spread the love

1 thought on “Shiva Shankar Master | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. శివ శంకర్ మాస్టర్ ఇకలేరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *