

Vijay Devarakonda | ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ హాట్ టాపిక్‌గా ఉన్నాడు. అతడు కేవలం పాన్ ఇండియా సినిమాలకే ఓకే చెప్తున్నాడని, స్టార్ దర్శకులకే డేట్స్ ఇస్తున్నాడని, చిన్న దర్శకులతో ఒప్పుకున్న సినిమాలను కూడా క్యాన్సిల్ చేసేస్తున్నాడంటూ గతకొన్ని రోజులు సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.

ఈ క్రమంలో శివ నిర్వాణ కూడా తన సినిమాలో వేరే హీరోని వెతుకున్నాడని, అందుకు విజయ్ సినిమా చేయనని చెప్పడమే కారణం అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శివ ఈ వార్తలపై స్పందించాడు. ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని శివను విజయ్‌తో సినిమా గురించి ప్రశ్నించడంతో డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు.
ఆ వార్తలన్నీ అబద్దాలని, తనతో విజయ్ సినిమా చేస్తున్నాడని, కాకపోతే కాస్త ఆలస్యం అవుతుందని చెప్పాడు. మరి విజయ్, శివ కాంబో మూవీ ఎప్పుడు పట్టాలేక్కుతుందో చూడాలి.
#ShivaNirvana #VijayDevarakonda #Liger