

Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్ కావాల్సిందే అంటూ బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ కామెంట్ చేసింది. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ రీమేక్ గురించి మాట్లాడుతూ ‘అత్రంగి రే’ బ్యూటీ హాట్ కామెంట్స్ చేసింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ రీమేక్ చేయాలంటే ఎవరితో చేస్తారన్న ప్రశ్నకు సారా అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ‘ఒకవేళ కరణ్ ఈ సినిమాను రీమేక్ చేస్తానంటే. నేను ఖచ్చితంగా అందులో చేస్తాను. అంతేకాకుండా ఈ సినిమాకు విజయ్, జాన్వీ కూడా కావాల’ని సారా అలీఖాన్ చెప్పింది.
అంతేకాకుండా కరణ్‌కు ఇప్పుడే ఫోన్ చేస్తున్నానని, కరణ్ తప్పకుండా ఓకే చెప్తాడని, జాన్వీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పక్కా అని సారా చెప్పుకొచ్చింది.
దీంతో బాలీవుడ్‌లో రౌడీ హీరో హవా నడుస్తోందని అర్థం అవుతోంది. ఇక విజయ్ అప్‌కమింగ్ మూవీ లైగర్ ఏరేంజ్ ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి.
#Sara Ali Khan #vijay Devarakonda #Janhvi kapoor #karan johar,