Samantha | విమర్శలను యాక్సెప్ట్ చేస్తాను.. కానీ అలా కాదు..

Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అంటే ఎక్కువగా గుర్తొచ్చే పేరు సమంత. అమ్మడు తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇటీవల నాగచైతన్యతో విడాకులు..

Spread the love
Samantha
Samantha

Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అంటే ఎక్కువగా గుర్తొచ్చే పేరు సమంత. అమ్మడు తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇటీవల నాగచైతన్యతో విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచింది. అప్పటి నుంచి సామ్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. కొందరు సరైన నిర్ణయం తీసుకున్నావని కామెంట్ చేస్తుంటే, కొందరు విమర్శిస్తున్నారు.

తాజాగా అమ్మడిని సోషల్ మీడియాతో తెగ ట్రోల్ చేస్తున్నారు. వీటిపై ఇప్పటి వరకు సమంత నోరు విప్పలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తనపై వస్తున్న ట్రోల్స్‌ గురించి పెదవి విప్పింది. తన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఒకేలా అర్థం చేసుకోవాలని కానీ అంగీకరించాలని కానీ నేను కోరుకోను. నా నిర్ణయం కొందరకి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు.

ఇది కూడా చదవండి: Jacqueline Fernandez | హీరోయిన్‌ను పట్టించిన పిల్లి, గుర్రం.. కెరీర్‌కి బ్రేకులు పడ్డట్లేనా..?

ప్రతి ఒక్కరికీ తమతమ అభిప్రాయం ఉండటాన్ని నేను అంగీకరిస్తాను. అయితే ఎదుటి వ్యక్తిని విమర్శించే సమయంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని నాగరికంగా వ్యక్తం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయమని సమంత చెప్పుకొచ్చింది. ఆఖరికి దీనిపై సైతం కొందరు అమ్మడికి వత్తాసు పలుకుతుంటే, కొందరు మాత్రం అమ్మడిని మళ్లీ ట్రోల్ చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *