Salman Khan | ‘అలా వేస్ట్ చేయకండి’.. ఫ్యాన్స్‌కు సల్మాన్ రిక్వెస్ట్

Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఫాన్స్ తనపై చూపిస్తున్న అభిమానాన్ని ప్రశంసిస్తూనే వారు చేస్తున్న..

Spread the love
Salman Khan

Salman Khan

Salman Khan

Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన ఫ్యాన్స్‌ను ఓ రిక్వెస్ట్ చేశాడు. ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న అభిమానాన్ని ప్రశంసిస్తూనే వారు చేస్తున్న పనిని తప్పుబట్టాడు సల్లూ భాయ్. తన కొత్త సినిమా అంతిమ్(Antim: The Final Truth) పోస్టర్‌కు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో కొంతమంది ఫ్యాన్స్.. అంతిమ్ పోస్టర్‌కు పాలతో అభిషేకం చేస్తున్నారు.

ఈ వీడియోను షేర్ చేసిన సల్మాన్.. ‘అలా పాలను వేస్ట్ చేయకండి. చాలా మంది మంచి నీళ్లను సైతం కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. మీరేమో ఇలా పాలను వృథా చేస్తున్నారు. మీరు నాపై అభిమానం ప్రదర్శించాలని అనుకుంటే మీరు వృథా చేస్తున్న పాలను ఆ పాలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న పేద చిన్నారులకు అందించండి’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

ఈ పోస్ట్‌పై అనేకమంది నెటిజన్లు సల్మాన్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. అందుకే సల్మాన్‌ను ‘ద మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్’ అంటారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Spread the love

3 thoughts on “Salman Khan | ‘అలా వేస్ట్ చేయకండి’.. ఫ్యాన్స్‌కు సల్మాన్ రిక్వెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *