

Sai Pallavi | నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. కొందరు అమ్మడి అందానికి ఫిదా అయితే.. మరికొందరు అమ్మడి కట్టబొట్టుకి ఫిదా అవుతారు. అంతా ఎక్స్‌పోజింగేలా ఉన్న ఈ సమయంలో కూడా ఏమాత్రం ఎక్స్‌పోజింగ్ చేయని హీరోయిన్ సాయి పల్లవి ఒక్కతే. తనదైన నటన, డాన్స్, క్యూట్ డైలాగ్ డెలవరీతో పలుభాషల ప్రేక్షకులను కట్టి పడేసింది
అయితే అమ్మడి తాజా సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సిల్క్ చీరలో వచ్చి నిండైన సాంప్రదాయాన్ని గుర్తుచేసింది. అదే శారీలో ఫొటో షూట్ చేసిన సాయి పల్లవి.. ఆ ఫొటోలను నేట్టింట షేర్ చేసింది. వాటిని చూసిన అభిమానులు అమ్మడి అందానికి దాసోహం అంటున్నారు.
‘నిలువెత్తు అందానికి సిల్స్ చీర కట్టినట్లుంది. చీరకే అందానిచ్చేశావ్‌గా. సాంప్రదాయ కట్టులోనే అసలైన అందం ఉందని నిన్ను చేస్తేనే అర్థం అవుతోంది. సాయి పల్లవి నీకెవరైనా ఫిదా కావాల్సిందే. ఈ సొగసు చూడతరమా, నీ అందం పొగడతరమా’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
#SaiPallavi #ShyamSinghaRoy #SocialMedia