Mahesh 28 | మహేష్‌తో సినిమా చేయాలా, వద్దా? కన్ఫ్యూజన్‌లో నేచురల్ బ్యూటీ!

Mahesh 28 | నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి సూపర్ స్టార్ మహేష్ 28వ సినిమాలో అమ్మడికి అవకాశం వచ్చిందట. కానీ ఈ సినిమా చేయాలా వద్దా..

Spread the love
Mahesh
Mahesh 28

Mahesh 28 | నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తనదైన నటనతో అందరినీ కట్టిపడేస్తోంది. తన అందం అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయిపల్లవి అందరినీ ఫిదా చేసేసింది. అయితే ప్రస్తుతం అమ్మడు తన తదుపరి సినిమా విషయంలో కన్ఫ్యూజన్‌లో పడిపోయిందట.

సూపర్ స్టార్ మహేష్ 28వ సినిమాలో అమ్మడికి అవకాశం వచ్చిందట. కానీ ఈ సినిమా చేయాలా వద్దా అని సాయి పల్లవి ఆలోచిస్తుందని టాక్ వినిపిస్తోంది. అయితే అందుకూ కారణం లేకపోలేదని, ఇందులో మహేష్ చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవిని మేకర్స్ సంప్రదించారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

ఈ కారణంతోనే నేచురల్ బ్యూటీ డైలమాలో పడిపోయిందట. ఇటీవల మెగాస్టార్ చిరు సినిమాలో సైతం ఇదే అవకాశం వస్తే అమ్మడు నో చెప్పేసింది.

ఇప్పుడు కూడా నో చెప్తే తన కెరీర్‌పై ప్రభావం పడుతుందని, అలాగని ఓకే చెప్తే స్టార్ హీరోల సరసన సినిమాల అవకాశాలపై ప్రభావం చూపుతుందని అమ్మడు ఆలోచిస్తోందని వార్తలు వస్తున్నాయి.

మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

#Mahesh #Saipallavi Mahesh28 Trivikram

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *