

RRR | తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ టాప్‌లో ఉంటుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అదే విధంగా వారి ఉత్సుకతను మరింత అధికం చేసేలా ఆర్ఆర్ఆర్ టీమ్ అప్‌డేట్స్ ఇస్తోంది. ప్రతి అప్‌డేట్ కూడా ఉత్కంఠతో ఉండటమేకాకుండా, సినిమాపై అంచనాలను అంలంచలుగా పెంచుతోంది.
అయితే ఈ సినిమా కోసం మూవీ టీమ్ ఎంతో సీరియస్‌గా రాత్రంబవళ్లు కష్టపడుతోంది. అదే సమయంలో సినిమా గురించి అభిమానులు అడిగే కొన్ని ప్రశ్నలకు ట్విటర్ వేదికగా రెస్పాండ్ అవుతుంది. అయితే ఇటీవల ఓ ఫ్యాన్‌కు ఆర్ఆర్ఆర్ టీమ్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరి చేత నవ్వులు పూయిస్తోంది.
అయితే శుక్రవారం ఆర్ఆర్ఆర్ నుంచి జననీ సాంగ్ విడుదలయ్యి ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. ప్రతి సీన్ కూడా గూస్‌బమ్స్ తెప్పించాయి. దీంతో ట్విట్టర్ ద్వారా అభిమానులు మూవీ టీమ్ కొన్ని ప్రశ్నలు అడిగారు. కొందరు పాట లిరికల్ షీట్ పెట్టమని అడగగా.. వారికి రేపు పంపుతానంటు టీమ్ రిప్లై ఇచ్చింది. ఇంతలో ఓ అభిమాని సినిమాలో ఐటెం సాంగ్ ఉందా బ్రో అని అడిగాడు. దానికి సమాధానంగా మూవీ టీమ్ ‘ఏ నువ్వు చేస్తావా’ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ మెసేజ్, రిప్లై తెగ వైరల్ అవుతున్నాయి.