

RRR | ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాల విడుదల విషయంలో అభిమానులకు షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాల విడుదల మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
దాదాపు ఏడాది పాటు ఈ సినిమాల కోసం ఎదురుచూసిన నిరాశే మిగలనుందంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా మహమ్మారి మహిమాఅని వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. భారీ బడ్జెట్‌తో ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు వారికి గుబులు పుట్టిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ దెబ్బకి ప్రభుత్వాలు మరోసారి కరోనా నిబంధనలను పటిష్టం చేస్తోంది.
ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నాయి. మరికొన్ని కూడా అదే ఆలోచనలో ఉన్నాయి. పరిస్థితులు ఏమాత్రం చేదాటినా సినిమా వసూళ్లు అంతంత మాత్రంగానే అవుతాయని, సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించామని మేకర్స్ టెన్షన్‌లో ఉన్నారట.
దీంతో సినిమాలను మరోసారి పోస్ట్ పోన్ చేయాలా అన్న ఆలోచనలు కూడా చేస్తున్నారని సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తాయా రావా అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
#RRR #Radheshyam #Prabhas #NTR #Rajamouli #RamCharan