RRR | ఓటీటీలో ఆర్ఆర్ఆర్‌.. అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చిన సంస్థ..??

RRR | మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’ టాప్‌లో ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వేయికళ్లతో..

Spread the love
RRR
RRR

RRR | మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’ టాప్‌లో ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.

తాజాగా కూడా జనవరి 7న రిలీజ్ అని ప్రకటించిన మేకర్స్ చివరి వారంలో వాయిదా వేశారు. వాయిదాకు దేశంలోని పరిస్థితులే కారణమని చెప్పారు. అయితే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’కు ఓ ఓటీటీ సంస్థ నుంచి అద్దిరిపోయే ఆఫర్ వచ్చిందట.

ఇది కూడా చదవండి: Naga Chaitanya | నాగచైతన్య కోసం లాల్ సింగ్ సినిమాలో కొత్త సీన్లు..?

సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు దాదాపు రూ.500 కోట్లు ఇస్తామని తెలిపిందట. కానీ జక్కన్న, టీం మాత్రం నో చెప్పేసిందని టాక్ నడుస్తోంది. సినిమాను ఎంత ఆలస్యం అయనా థియేటర్లలోనే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట.

అందుకే అంతపెద్ద ఆఫర్ వచ్చినా ససేమిరా అన్నారని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 90 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని సినిమా హిందీ డిస్ట్రిబ్యూటర్ పెన్ స్టూడియోస్ తెలిపింది.

#RRR #NTR #RamCharan #Rajamouli #OTT

Spread the love

1 thought on “RRR | ఓటీటీలో ఆర్ఆర్ఆర్‌.. అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చిన సంస్థ..??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *