

RGV | ఏపీ ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య మినీ యుద్ధమే నడుస్తోంది. సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదంటూ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చింది. దీంతో ఇండస్ట్రీ, ఏపీ ప్రభుత్వం మధ్య పరిస్థితులు వేడెక్కాయి.
ఇంతలో క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గోదాలోకి దిగారు. ఇండస్ట్రీకి సపోర్ట్‌గా వాదించారు. ఈ క్రమంలోనే లాజికల్‌గా 10 ప్రశ్నలు అడుగుతూ ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని, ఆర్‌జీవీకి మధ్య ట్వీట్ల వార్ జరిగింది.
ఒరికొకరు సమాధానాలు ఇచ్చుకుంటూ, తమ సందేహాలు తెలుపుకున్నారు. ఇందులో భాగంగా ఆర్‌జీవీ మిమ్మల్ని కలిసి మాట్లాడతానంటూ ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఆర్‌జీవీ మరో ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: Sathyaraj | కట్టప్పకు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం
ఏపీ మంత్రి పేర్ని నాని తనను అమరావతికి ఆహ్వానించారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘గౌరవనీయులైన ఆంధ్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారు జనవరి 10న నన్ను అమరావతి సెక్రటేరియట్‌కు రమ్మని ఆహ్వానించారు.
ఈ విషయం చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా సినిమా టికెట్ల విషయంలో మా అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకునేందుకు సిద్ధమైన పేర్ని నాని గారి ప్రయత్నానికి నా ధన్యవాదాలు’ అని ఆర్‌జీవీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
#RGV #PerniNani #Amaravati #MovieTickets
1 thought on “RGV | ఆంధ్రా ప్రభుత్వం నుంచి ఆర్జీవీకి పిలుపు.. ఆనందంగా ఉందంటూ..”