Ram Charan | శంకర్ మూవీ రిలీజ్‌పై చెర్రీ క్లారిటీ..

Ram Charan | మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు ఆర్ఆర్ఆర్ చేస్తూనే మరోవైపు కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమాను కంప్లీట్ చేశాడుq

Spread the love
Ram Charan | RC15 |

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు ఆర్ఆర్ఆర్ చేస్తూనే మరోవైపు కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమాను కంప్లీట్ చేశాడు. ఈ సినిమాలు పూర్తి కాకముందే మరో భారీ ప్రాజెక్ట్‌ను ఓకే చేశాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన 15వ సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రస్తుతం ఆర్‌సీ15గా ప్రచారంలో ఉంది. అయితే ప్రస్తుతం పెద్ద హీరోలు, పెద్ద సినిమాల సైతం ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్‌సీ15 ఎందులో రిలీజ్ అవుతుందని అభిమానులు సందేహ పడుతున్నారు. దీనిపై తాజాగా చెర్రీ క్లారిటీ ఇచ్చాడు. ‘శంకర్ దర్శకత్వంలో నేను నటిస్తున్న ఆర్‌సీ15 ఓ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కతోంది. ఇది థియేర్లలో చూస్తే ఆ కిక్కే వేరు. ప్రతి ప్రేక్షకుడికి ఆ కిక్క్ ఇవ్వాలని మేము భావిస్తున్నాం.

అందుకని ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేస్తామ’ని చరణ్ అన్నాడు. అంతేకాకుండా అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా 2023 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుంటుందని చెప్పాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *