

Ram Charan | మెగా పవర్ స్టార్ రాం చరణ్ వరుస సినిమాలను ఓకే చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలో ఉండగానే శంకర్, గౌతమ్ తిన్ననూరి సినిమాలను లైన్లో పెట్టేశాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడటంతో శంకర్ మూవీలో చేస్తున్నాడు.
అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ సినిమా స్టార్టింగ్‌లోనే ఫిక్స్ అయిపోయిందట. సినిమాను 2023 సంక్రాంతి బరిలో ఉంచాలని శంకర్ అనుకునే సినిమాను స్టార్ట్ చేశాడట.
అనుకున్న తరహాలోనే సినిమా షూటింగ్‌ను శరవేగంతో కంప్లీట్ చేస్తున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని, మూడో షెడ్యూల్ కూడా దాదాపు పూర్తి కావచ్చిందని టాక్ నడుస్తోంది. మరి దీనిపై త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
#RC15 #RamCharan #Shankar #Sankranthi