

మాస్ మహరాజ్ ‘క్రాక్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ‘క్రాక్’ తర్వాత వరుస సినిమాలు ఓకే చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నాడు. అయితే తాజాగా రవితేజ గురించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. చిరు కోసం రవితేజ రూ.7 కోట్లు తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ సినిమా ‘పవర్’ చిత్రసీమకు పరిచయం అయిన దర్శకుడు బాబీ.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చిరు తన 154 వ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాబీ రవితేజను సంప్రదించాడంట. చిరు సినిమాలో అవకాశం అనే రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ సినిమాకు రూ.7 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే చిరు, బాబీ కాంబోలో వస్తున్నా చిరు 154 లో చిరంజీవి ఫ్రెండ్ పాత్రలో రవితేజ కనిపించనున్నాడని, రవితేజ పాత్ర కూడా చాలా ఇంటరస్టింగ్‌గా సాగుతుందని టాక్ నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. మరి సినిమా తెరకెక్కిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ దీనిపై క్లారిటీ ఇస్తుందేమో వేచి చూడాలి.