

Raviteja | మాస్ మహరాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. క్రాక్ సినిమా అందించిన బూస్ట్‌తో రవితేజ వరుస సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఖిలాడి’ సినిమా విడుదలకు సిద్ధం అయింది.
దాంతో పాటుగా రవితేజ తన నెక్స్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ని కూడా తుది దశకు తీసుకొచ్చేశాడు. వీటి తర్వాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’ను ప్రారంభించనున్నాడు.
అయితే ఈ సినిమాలో రవితేజ ఓ యంగ్ హీరోకి అవకాశం ఇచ్చాడట. ఓ కీలక పాత్రకి యువ హీరో అయితే సరిగ్గా సరిపోతాడని భావించడంతో మేకర్స్ రాజ్ తరుణ్‌ను ఓకే చేశారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
దానికి తోడుగా రాజ్ తరుణ్‌ను రవితేజనే సజెస్ట్ చేశాడని, మేకర్స్ వేరే వాళ్ల పేర్లు చెప్పినప్పటికీ రవితేజ పట్టుబట్టాడని టాక్ నడుస్తోంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే యాక్షన్, రొమాంటిక్ సినిమాగా తెరకెక్కుతున్న ‘ధమాకా’ను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా రవితేజ సరసన శ్రీ లీలా నటించనుందట.
మరి కొందరు హీరోయిన్లను కూడా మేకర్స్ ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై కూడా త్వరలో క్లారిటి వస్తుందేమో చూడాలి.
#RaviTeja# Raj Tarun# Dhamaka# Khiladi,