Balakrishna | బాలయ్యతో గొడవపై రవితేజ క్లారిటీ.. వాళ్లవల్లే అని..

Balakrishna | నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా హోస్ట్‌గా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టైటిల్‌ దుమ్ము

Spread the love
Balakrishna

Balakrishna | నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా హోస్ట్‌గా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టైటిల్‌ దుమ్ము దులేపిస్తాడు. అయితే తాజాగా ఈ షో ద్వారా బాలయ్య, రవితేజ మధ్య గొడవపై క్లారిటీ ఇచ్చారు. అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో దీనిపై క్లారిటీ ఇచ్చారు.

ఈ షోకు గెస్ట్‌గా వచ్చిన రవితేజ ఈ గొడవకు సంబంధించిన విషయాన్ని బయటపెట్టాడు. ఈ ఎపిసోడ్ ప్రోమోలో బాలయ్య ‘మన మధ్య ఓ పెద్ద గొడవ అయ్యిందట కదా’ అని అడిగాడు. దీనికి సమాధానమిచ్చిన రవితేజ.. ‘పనిపాట లేని డ్యాషు గాళ్లు ఈ గొడవను క్రియేట్ చేశార’ని చెప్పాడు. దీంతో అభిమానులకు వీరి మధ్య గొడవపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

అయితే ఈ షోలో మరెన్నో విషయాలను కూడా పంచుకున్నారు. తనపై పడిన డ్రగ్స్ కేసు, తన వ్యక్తిగత విషయాలను గురించి రవితేజ చెప్పాడు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 31న ప్రసారం కానుంది.
https://youtu.be/MDb4A22JnUc
#Raviteja #NBK #Unstoppable

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *