

Rashmika | రష్మిక మందన్నకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పుష్ప’ సినిమాతో అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. అమ్మడి అందానికి దేశ వ్యాప్తంగా కుర్రకారు ఫిదా అయిపోయారు.
ఈ సినిమాలో అమ్మడు డీ గ్లామర్ పాత్ర చేసినపప్పటికీ అభిమానులు అమ్మడి దాసోహం అన్నారు. అయితే ప్రస్తుతం రష్మిక మళ్లీ తన క్లాస్ అండ్ సెక్సీ లుక్స్ కోసం కసరత్తులు చేస్తోందట. అందుకు తన నెక్స్ట్ మూవీనే కారణం.
రష్మిక తన తదుపరి సినిమాను రాహుల్ రవింద్రన్ దర్శకత్వంలో చేస్తోంది. ఈ సినిమా రాహుల్ లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. కథను కూడా నెవ్వర్ బిఫోర్ అనేలా రెడీ చేశాడని టాక్ వస్తోంది. అయితే ఈ సినిమాలో రష్మిక క్లాస్ లుక్స్‌లో కనిపించనుందట.

ఆ లుక్స్ కోసమే ప్రస్తుతం రష్మిక జిమ్‌లో కుస్తీలు పడుతోంది. ఇక రష్మిక ఒక్కసారి ఓకే అంటే సినిమాను పట్టాలెక్కించేందుకు రాహుల్ రెడీగా ఉన్నాడట.
ఈ సినిమాను జీఏ2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
#Rashmika #RahulRavindran #Pushpa