

RAPO19 | టాలీవుడ్ యంగ్ హీరోల మధ్య టైటిల్ పోరు మొదలైంది. టైటిల్ మాదంటే మాదంటూ ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించారు. ఈ విషయంలో ఆఖరికి ఫిల్మ్ ఛాంబర్ వారికి సైతం ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
ఈ టైటిల్ పోరు టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జటిక్ హీరో రామ్ అప్‌కమింగ్ మూవీ ‘ది వారియర్’ గురించి. ఈ టైటిట్ యంగ్ హీరో హవిష్ తన సినిమాకు రిజిస్టర్ చేసుకున్నాడట. అదే టైటిల్‌తో రామ్ తన అప్‌కమింగ్ మూవీని ప్రకటించడంతో దాసరి కిరణ్ ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాడు.
విదేశాల్లో చిత్రీకరణ కారణంగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేట్ అయ్యిందని నిర్మాత దాసరి కిరణ్ తెలిపారు. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోందని, ఈ సినిమా ‘ది వారియర్’ టైటిల్ సరిగ్గా సరిపోతుందనే ముందుగా రిజిస్టర్ చేసుకున్నామని కిరణ్ తెలిపారు.
అయితే ఇప్పుడు రామ్, లింగుస్వామి కాంబో మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేసేశారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు జుట్టు పీకుంటున్నారు. మరి ఇందులో ఛాంబర్ చివరికి ఏమని నిర్ణయిస్తుందో, ఎవరికి ఆ టైటిల్ కేటాయిస్తుందో చూడాలి.
#RamPothineni #RAPO19 #Havish #TheWarrior