

Rapo 19 | టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. రాపో19 షూటింగ్‌లో రామ్ మెడకు గాయం కావడంతో అతడు గ్యాప్ తీసుకున్నాడు. అయితే నాలుగు నెలల తర్వాత మళ్లీ రామ్ తన హెల్త్‌పై అప్‌డేట్ ఇచ్చాడు.
తాను పూర్తిగా కోలుకున్నానని, సినిమా చిత్రీకరణను కూడా త్వరలో ప్రారంభిస్తానని చెప్పాడు. అంతేకాకుండా గాయం తగ్గిన తరువాత ఫ్యాన్స్‌ను కలుస్తానని చెప్పిన రామ్ ఇచ్చిన మాట ప్రకారం తాజాగా అభిమానులను కలిసి ముచ్చటించాడు.
అయితే రాపో19 షూటింగ్ వచ్చే ఏడాది జనవరి5 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఇందులో బేబమ్మ కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ సరికొత్త మాస్‌లుక్స్‌తో కనిపించనున్నాడని మూవీ టీం అంటోంది.
దీంతో ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్‌ను మించి మాస్ యాంగిల్‌లో రామ్ కనిపించనున్నాడని అభిమానులు ఊహిస్తున్నారు. మరి అభిమానుల ఊహలను రామ్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.
#RamPothineni #Rapo19 #kriti shetty