RRR | చెన్నైకి చెక్కేసిన చరణ్.. ఆర్ఆర్ఆర్ వాయిదానే కారణం..??

RRR | మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సినిమాల విషయంలో దూసుకుపోతున్నాడు. చరణ్ తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు..

Spread the love
RRR

RRR | మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సినిమాల విషయంలో దూసుకుపోతున్నాడు. చరణ్ తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్‌తో మరో సినిమాను ఓకే చేశాడు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ టైం వేస్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు.

ఇది కూడా చదవండి: Nidhi Agarwal | స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అయిన ఇస్మార్ట్ భామ..?

అందుకే శంకర్ సినిమాను స్టార్ట్ చేసేశాడు. ఆ సినిమా షూటింగ్ కోసమని చెన్నైకి వెళ్లాడని సమాచారం. ఆర్‌సీ15 సినిమా కోసం ఇప్పటికే శంకర్ భారీ సెట్స్‌లో ఏర్పాటు చేశారు.

ముందుగా ఈ సెట్స్‌లో యాక్షన్ సీన్స్ చేయనున్నరాట. అనంతరం ఓ పాటను కూడా చిత్రీకరించనున్నారని టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ త్వరలో తెలపనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో నిజానిజాలు తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వరకు ఆగాల్సిందే.

#RamCharan #RRR #RC15 #Shankar

Spread the love

1 thought on “RRR | చెన్నైకి చెక్కేసిన చరణ్.. ఆర్ఆర్ఆర్ వాయిదానే కారణం..??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *