

ప్రస్తుతం తెలుగు ప్రరేక్షులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సినిమాల్లో ఆచార్య తప్పక ఉంటుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీ రోల్‌లో కనిపించనున్నాడు. వీరికితోడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల డైరెక్షన్. వీరి ముగ్గురి కాంబో అనేసరికి అభిమానుల అంచనాలకు అవధులు లేకుండా పోయాయి. సినిమా ఏ రేంజ్‌లో ఉండొచ్చు అన్నది వారి ఊహకు కూడా అందడం లేదు. అందుకే ఈ సినిమా అప్‌డేట్స్ కోసం నిరంతరం నిరీక్షిస్తున్నారు. అందులోనూ ఇప్పటికే వచ్చిన చిరు ఫస్ట్ గ్లింప్స్, టీజర్, పాటలు అదరహో ఆచార్య అనిపించాయి.
ఇది కూడా చదవండి: Pooja Hegde | పెగ్గు కలిపిన బుట్టబొమ్మ.. ఏ బ్రాండో చూశారా..
ప్రస్తుతం అందరూ రామ్ చరణ్ సిద్దా అప్‌డేట్ కొసం ఎదురుచూస్తున్నారు. అయితే వారి దిమ్మతిరిగిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సిద్ద ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు సిద్దం అయింది. దీని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 28 అంటే ఆదివారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సిద్ద సాగా మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. దీంతో ఈ టీజర్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని అభిమానులు చూస్తున్నారు.