RRR | ఎన్‌టీఆర్ గాయానికి కారణం అదే.. నిజం బయటపెట్టిన రాజమౌళి

RRR | ‘ఆర్ఆర్ఆర్’ ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకోసం కేవలం

Spread the love
RRR

RRR | ‘ఆర్ఆర్ఆర్’ ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకోసం కేవలం తెలుగు వాళ్లే కాదు. యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. అయితే ఈ సినిమా అప్‌డేట్స్ కోసం కూడా ప్రేక్షకులు అదే ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇటీవల ఎన్‌టీఆర్ తన చేతికి కట్టుకట్టుకొని కనిపించాడు.

దీంతో అభిమానులు కాస్త ఆందోళన చెంది. ఎన్‌టీఆర్‌కి ఏమైందంటూ అనేక ప్రశ్నలు వేశారు. కానీ ఎన్‌టీఆర్ నోరు విప్పలేదు. తాజాగా ఆగాయానికి ఉన్న కథను దర్శకధీరుడు రాజమౌళి చెప్పాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జక్కన్న అసలు విషయాన్ని బయట పెట్టాడు. సినిమాలోని ఓ యాక్షన్ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నామని అందులోనే ఎన్‌టీఆర్ గాయపడ్డాడని రాజమౌళి చెప్పాడు.

‘సినిమాలో యాక్షన్ ఫైట్ చేస్తున్నాం. అందులో ఫైట్ రోప్ సహాయంతో షూట్ చేయాల్సి ఉంది. అందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఒకవేళ ఎన్‌టీఆర్ పడిపోయినా దెబ్బ తగలకుండా ఉండేలా ఏర్పాట్లు చేశాం. అంతా బాగుందని షూటింగ్ స్టార్ట్ చేశాం. ఇంతలో ఎన్‌టీఆర్ పడిపోయాడు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కువ ఒత్తిడి కారణంగా ఎన్‌టీఆర్ చేతికి గాయం అయింది. దాంతో షూటింగ్‌ను నిలిపివేశాం.

దాదాపు నెల రోజుల తర్వాత ఎన్‌టీఆర్ కోలుకున్నాడు. అప్పుడు సినిమాను తిరిగి ప్రారంభించామ’ని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఆ తరువాత ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా చిన్నచిన్న గాయాలను పట్టించుకోలేదని, తమతమ సీన్స్‌పైనే దృష్టి పెట్టేవారని రాజమౌళి చెప్పాడు.

#Rajamouli #RamCharan #NTR #RRR

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *