

రాజమౌళి డైరెక్షన్ అంటేనే సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయి. అంతేకాకుండా సినిమాకు హిట్ టాక్ వచ్చేస్తుంది. హీరో, హీరోయిన్లతో సంబంధం లేకుండా ఈ టాక్ సంపాదిస్తోంది. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాకు జక్కన్న దర్శకత్వంతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ క్రేజ్ కూడా తోడైంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌తోనే సంచలనాలు సృష్టించింది. ఈ క్రమంలో చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు.. రాజమౌళి తన హాలీవుడ్ ఎంట్రీ గురించి కొందరు ప్రశ్నించడంతో రాజమౌళి స్పందించాడు. తనకు ఎటువంటి ఛాన్స్ రాలేదని చెప్పాడు.
నాకు హాలీవుడ్ నుంచి ఎటువంటి అవకాశం రాలేదు. అయినా నేను హాలీవుడ్ సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఇండియా సినిమాలనే హాలీవుడ్‌కి తీసుకెళ్లడానికే ప్రయత్నిస్తాను’ అని జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. దీంతో అక్కడి ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. అయితే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్‘ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Rajamouli, NTR, Ram Charan, RRR, Hollywood, Indian Movies,