

Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
మిగలిన సినిమాలన్నీ సంక్రాంతి వేట కోళ్లు కానున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. వారికి ఒక్కసారిగా రాధేశ్యామ్ మేకర్స్ షాక్ ఇచ్చారు. దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల కారణంగా సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం లేదంటూ వారు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: NBK107 | బాలయ్య సినిమాలో జయమ్మ.. ఇక రచ్చ రచ్చ
ఒమిక్రాన్ కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూసేశారని, ఈ పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం రిస్క్ అవుతుందని మేకర్స్ తెలిపారు. సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
#RadheShyam, #Prabhas, #Snkranthi
1 thought on “Prabhas | ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా”