

Raashi Khanna | ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఆ తరువాత తనదైన నటన, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం అమ్మడు నెవ్వర్ బిఫోర్‌లా బిజీ అయిపోయింది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్‌లో ఉంది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీల్లోనూ అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం రాశి దాదాపు ఆరు సినిమాలను ఓకే చేసి ఉంది. వాటితో పాటుగా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తోంది. తెలుగులో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్యకు జంటగా ‘థాంక్యు’ సినిమాల్లో చేస్తోంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
వీటితో పాటు తమిళంలో కార్తీ సినిమా ‘సర్దార్’లో నటిస్తోంది. అంతేకాకుండా ధనుష్ మూవీ ‘తిరుచిత్రంబలం’తో పాటు శివాజి, అర్జున్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ‘మేధావి’ సినిమాల్లో నటిస్తోంది.
ఇక హిందీ విషయానికొస్తే సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా వస్తున్న ‘యోధ’ సినిమాలో చేస్తోంది. మరో సినిమాను కూడా ఓకే చేసింది. అది ఇంకా ప్రారంభం కాలేదు. అది కూడా త్వరలోనే పట్టాలెక్కేందుకు సన్నద్ధమవుతోంది.
#RaashiKhanna #Dhanush #NagaChaitany #Kaarthi #Yodha