

Pushpa | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తాజా సినిమా ‘పుష్ఫ’తో పాన్ ఇండియా రేంజ్ అందుకోవాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు. పుష్ప డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమాకు చాలా క్రేజ్ ఉందని, కానీ నార్త్‌లో సినిమాను బాగా ప్రమోట్ చేయాలని జక్కన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. అయితే పుష్ప టీమ్ మాత్రం ఇప్పటి వరకు నార్త్ ఇండియా వైపు చూసింది కూడా లేదు.
దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ సినిమా బీజీఎమ్ విషయంతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్, రష్మిక హైదరాబాద్‌లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
కానీ బాలీవుడ్‌లో మాత్రం వీరు ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా చేయలేదు. ఇక మిగిలింది 3 రోజులే. ఇంత తక్కువ సమయంలో బన్నీ ఏం మ్యాజిక్ చేస్తాడో ఎవరికీ అర్థం కావడం లేదు.
అయితే ఫ్యాన్స్ మాత్రం ‘పుష్పరాజ్.. బాలీవుడ్‌ని వదిలేశావా..? ఏంటి..?’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి దీనికి బన్నీ నుంచి కానీ, పుష్ప టీం నుంచి కానీ ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.
#Pushpa #AlluArjun #Rashmika #Sukumar #DSP #Bollywood