

Prabhas | ప్రభాస్ సినిమా అంటేనే భారీ క్రేజ్ ఉంటుంది. వాటిలోనూ కొన్ని మరీ ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాంటి వాటిలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్-K’ ఒకటి.
ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ కోసం, ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే వారు ఆశించిన లుక్స్, పోస్టర్స్ సంగతేమో తెలీదుకాని. ప్రస్తుతం సినిమా కథకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో హీరో ఎలా టైం ట్రావెట్ చేస్తాడని ఈ అప్‌డేట్ చెప్పేస్తోంది. హిమాలయాల్లో ఓ వార్మ్ హోల్ ఉంటుందట. అది సమయానికి అతీతంగా సాగే ఓ మార్గంలా పనిచేస్తుందట.
ఇదే సినిమాలో కీ పాయింట్ అని సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు ఆగాల్సిందే.
#Project-k #Prabhas # Nag Ashwin # warm hole