

సాధారణంగా ప్రతి నటినటుడు తమకంటూ ఓ స్టార్ డమ్ వచ్చిన తరువాత తాను కోరుకున్న పాత్రలనే చేయడానికి ఇష్టపడతాడ. ఇందులో కొందరు పారితోషికం చూసుకుంటే, మరికొందరు పాత్ర, నటనకు అవకాశం చూసుకుంటారు. కానీ ఫలానా పాత్ర చేయాలని అని అందరికీ ఉంటుంది. అయితే వారు దాన్ని అంతతొరగా బయటకు చెప్పారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్దె తన కోరికను బయటపెట్టేసింది. తన తాజా సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి నెట్‌ఫ్లిక్స్ ప్రమోషన్స్ చేస్తున్న సందర్భంగా అమ్మడు తన కోరికను బయటపెట్టింది.
ఇది కూడా చదవండి: Allu Arjun | సమంత కోసం ముంబై వెళ్లిన పుష్పరాజ్..?
తనకు ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని ఉందని, అలాగని ఆఫ్‌బీట్ పాత్రలకు కాదని చెప్పుకొచ్చిన పూజా.. తనకు వండర్ ఉమెన్ వంటి పాత్ర చేయాలంటూ తెలిపింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు.. అంటే ఇప్పుడు అవకాశం వస్తే పూజా హెగ్దె వండర్ ఉమెన్‌గా మరి చెడును సంహరిస్తుందన్న మాట అని కొందరు, పూజా నువ్వెప్పుడూ మా వండర్ ఉమెన్‌వే మరికందరు కామెంట్లు చేస్తున్నారు.
2 thoughts on “Wonder Woman | అలాంటి పాత్రలు చేయాలని ఉంది.. పూజా హెగ్దె”