

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మూవీ మేకర్స్ షాక్ ఇచ్చాడు. రెండు నెలల వరకు సినిమా షూటింగ్‌లను బ్రేక్ ఇచ్చాడు. హరిహర వీరమల్లు, భగవదీయుడు భగత్‌సింగ్ సినిమాల షూటింగ్ ఇప్పుడప్పుడే కాదంటూ తల అడ్డం తిప్పేశాడు.
ఈ మేరకు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల కారణంగా మూవీ మేకర్స్ సినిమా షూటింగ్‌ల విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు.
ఇదే విధంగా పవన్ మూవీ మేకర్స్ కూడా పవన్ మాట కోసం ఎదురుచూస్తుండగా పవన్ షాక్ ఇచ్చాడట. దాదాపు రెండు నెలల వరకు సినిమాల షూటింగ్ రీస్టార్ట్ చేయొద్దని ఖరాఖండిగా చెప్పేశాడని టాక్ నడుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిఒక్కరి ఆరోగ్యంగా ముఖ్యమని, అందుకే పవన్ రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ప్రకటన ఏమీ రాలేదు. త్వరలో అధికారిక ప్రకటన ఏమైనా వస్తుందేమో చూడాలి.
#PawanKalyan #BheemlaNayak #HariHara #Veeramallu