Bheemla Nayak | పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. 7 రోజుల్లోనే..

Bheemla Nayak | పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికీ కళ్లు బైర్లు కమ్మే..

Spread the love
Bheemla nayak
Bheemla nayak

పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికీ కళ్లు బైర్లు కమ్మే వార్త ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుందని, అన్ని అనుకున్నట్లు జరిగితే వారం రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుందని వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. భీమ్లా నాయక్‌కు ఇక వారం రోజులే ఉన్నాయని సినీ సర్కిల్స్‌లోనూ బజ్ వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Megastar Chiranjeevi | భోళా శంకర్‌ బడ్జెట్ విషయంలో చిరు వెనకడుగు..?

దీంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఎవరైన ప్రకటిస్తారేమో వేచి చూడాలి. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 22కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి అభిమానుల అంచనాలను భీమ్లా నాయక్ అందుకుంటాడా లేదా అని తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *