

RRR | మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం అభిమానులు ఎంత ఆశక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వేచి చూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమాను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ అభిమానులను నిరాశ పరుస్తున్నారు.
ఇటీవల కూడా జనవరి 7 రిలీజ్ పక్కా అని చెప్పి పదిరోజులు కూడా లేనప్పుడు పోస్ట్ పోన్ చేశారు. అయితే తాజాగా మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఏదిఏమైనా ఈసారి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయిపోయారట.
ఈ సినిమా విడుదల విషయంలో హీరోలు ఎన్‌టీఆర్, రాం చరణ్ తొందర పెట్టడంతో మేకర్స్ మూవీ రిలీజ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం సమ్మర్‌ను ఎంచుకున్నారట.
కుదిరితే ఏప్రిల్ చివరి వారంలో లేకుంటే మే మొదటి వారంలోనైనా సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారనటి సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
#RRR #RamCharan #NTR #Rajamouli #Summer