

Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత ఫుల్ జోష్‌లో సినిమాలు చేస్తోంది. తనపై వచ్చే విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’లో ‘ఊ అంటావా మావా’ అంటూ కుర్రకారుని ఉర్రూతలూగించింది.
అయితే తాజాగా అమ్మడికి యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్‌టీఆర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్రకోసం ఎన్‌టీఆర్ సమంతను సజెస్ట్ చేశాడని సోషల్ మీడియా కోడైకూస్తోంది. వీరిద్దరి జోడీ ఇప్పటికే నాలుగు సినిమాల్లో ప్రేక్షకులను అలరించగా. ఐదో సారి జతకట్టాలని ఎన్‌టీఆర్ భావిస్తున్నాడట.
అంతేకాకుండా ప్రస్తుతం సమంతకు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ మంచి క్రేజ్ ఉంది. కాబట్టి కొరటాలతో చేయనున్న సినిమాను సమంత బెస్ట్ చాయిస్ అని ఎన్‌టీఆర్ భావిస్తున్నాడంటూ సినీ వర్గాలు అంటున్నాయి. ఇదే గనుక నిజమైతే ఈ సినిమా సమంత, ఎన్‌టీఆర్, కొరటాల కాంబోలో వచ్చే రెండో సినిమా అవుతుంది. జనతాగ్యారేజ్‌తో బంపర్ హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
#NTR #Samantha #upcomingMovie #Pushpa