

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ సినిమా ‘హరిహర వీరమల్లు’. పవన్ కెరీర్‌లో చేస్తున్న మొట్టమొదటి పీరియాడికల్ సినిమా ఇది. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
కానీ సినిమా నుంచి అప్‌డేట్స్ మాత్రం అంతగా రావడం లేదు. ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇటీవల అమ్మడి లేటెస్ట్ మూవీ ‘హీరో’ రిలీజ్ అయింది.
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన బ్యూటీ ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి షాకింగ్ సీక్రెట్స్ బయట పెట్టేసింది. ఈ సినిమా పీరియాడికల్ సినిమానే అయినా ఇందులో వేరే డైమెన్షన్ కూడా ఉంటుందని, వేరు వేరు కాలాల్లో సినిమా కథ ఉంటుందని అమ్మడు చెప్పింది.
దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇన్నాళ్లు పిరియాడిక్ లుక్‌ను మాత్రమే చూపించిన మేకర్స్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. మరి త్వరలో మేకర్స్ సర్‌ప్రైజ్ ఇస్తారేమో చూడాలి.
nidhi agarwal, pawan kalyan, Harihara Veera mallu