Nidhi Agarwal | స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అయిన ఇస్మార్ట్ భామ..?

Nidhi Agarwal | సవ్యాసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ సినిమా తర్వాత అమ్మడు..

Spread the love
Nidhi Agarwal

Nidhi Agarwal | సవ్యాసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ సినిమా తర్వాత అమ్మడు వరుస అవకాశాలు ఉందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోయిన్‌గా హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది.

అయితే తాజాగా అమ్మడి గురించి ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అమ్మడు ఓ స్టార్ హీరోతో ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందనంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు. కోలీవుడ్ మన్మథుడు శింబు.

ఇది కూడా చదవండి: Liger | రౌడీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ‘లైగర్’ షూటింగ్‌ రిస్క్ అన్న మేకర్స్

వీరిద్దరు కలిసి ఈశ్వరన్ సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీరు రిలేషన్‌లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా తమ ప్రేమను బంధాన్ని వివాహ బంధంగా మార్చాలని ఫిక్స్ అయ్యారట.

అయితే ప్రస్తుతం ఇద్దరూ కెరీర్‌పై ఫోకస్ పెట్టారని, త్వరలోనే అభిమానులకు స్వీట్ న్యూస్ వినిపిస్తారనటి సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై వీరిలో ఎవరైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

#NidhiAgarwal #Shimbhu #Marriage

Spread the love

1 thought on “Nidhi Agarwal | స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అయిన ఇస్మార్ట్ భామ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *