

Pawan Kalyan సినిమా అంటేనే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అందులోనూ పవన్ నెవ్వర్ బిఫోర్ గెటప్ అంటే ఇక అభిమానులకు పండగే. ఇదే తరహాలో వస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి నెట్టింట ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అగర్వాల్ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకుందట.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాతో పాటు సినీ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్. అయితే దీనిపై ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ స్పందించారు. నిధి అగర్వాల్ సినిమా నుంచి తప్పుకోలేదని, సినిమాపై బురదజల్లే ప్రయత్నంలోనే గిట్టనివారు ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నారని తేల్చి చెప్పారు. ఇటువంటి పుకార్లను ప్రేక్షకులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
ఇది కూడా చదవండి: Akhanda | అఖండ అదుర్స్.. మా వల్ల కాదంటున్న అమెరికా థియేటర్లు..
ఇదిలా ఉంటే ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తుండగా క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ జాక్వెలిన్ ఫెర్నాండజ్, అర్జున్ రాం పాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దానికి తోడు ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇందులో అభిమానులు ఆశించే ప్రతి అంశం ఉండనుందని టీమ్ చెబుతోంది. మరి ఈ సినిమా అభిమానులకు ఆశించిన స్థాయిలో ఆకట్టుకుంటుందో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
1 thought on “Pawan Kalyan | పవన్ సినిమా నుంచి హీరోయిన్ అవుట్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్”