

Nani | నేచురల్ స్టార్ నాని గతేడాది ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ కంబ్యాక్ ఇచ్చాడు. రెండేళ్ల పాటు పరాజయాలను చవిచూసిన నాని ‘శ్యామ్ సింగరాయ్’తో జూలు విదిలించాడు.
అన్ని అడ్డుంకులను అధిగమించి భారీ హిట్ సాధించాడు. ఈ ఏడాది కూడా అదే తరహాలో విజయం సాధించాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే అభిమానులకు న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట.
తన అప్‌కమింగ్ మూవీ ‘అంటే సుందరానికి’ నుంచి జీరో లుక్‌ను రిలీజ్ చేయనున్నాడట. ఈ జీరో లుక్ 2022 జనవరి 1 సాయంత్రం 4:05 గంటలకు ప్రేక్షకుల ముందుకు రానుందని నాని ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
అయితే ఈ సినిమాతో మళయాళం బ్యూటీ నజ్రియా తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్యూటీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో దూసుకుపోతోంది. మరి ఈ సినిమాలో నాని లుక్స్ ఎలా ఉంటాయన్నది తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.
https://twitter.com/NameisNani/status/1476502248477786115?s=20
#Nani #ShyamSingha roy #AnteSundaraniki #NewYear