

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ బౌన్స్ బ్యాక్ హిట్ అందుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన నానికి ఫ్యాన్స్ భారీగా వెల్‌కమ్ పలికారు. అయితే ‘శ్యామ్ సింగరాయ్’ అందించిన విజయంతో నాని తన ట్రెండ్ మార్చేశాడు. చిన్ని కథలను తన నటనతో పండించడం కన్నా గొప్ప కథలను తన నటనతో మరింత గొప్పగా చేయాలని డిసైడ్ అయిపోయాడు.
అందులో భాగంగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓడెల సినిమా ‘దసరా’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో నాని సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఫుల్ గడ్డంతో రఫ్ లుక్స్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ లుక్స్‌కు సంబంధించిన పోస్టర్‌ను టీం తాజాగా రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమాలో నాని నెగిటివ్‌గా కూడా కనిపించనున్నాడట. నాని కెరీర్‌లో నెగిటివ్‌గా కనిపించిన సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి. మరి ఈ సినిమా అయినా హిట్ అందుకుంటుందేమో చూడాలి.